బ్రేకింగ్: అసభ్య ఫోటో షూట్, పూనం పాండే అరెస్ట్…!

-

బాలీవుడ్ నటి పూనమ్ పాండేను అశ్లీల వీడియో చిత్రీకరించినందుకు ఉత్తర గోవాలో పోలీసులు అరెస్టు చేశారు. గోవా ప్రభుత్వ జల వనరుల శాఖ యాజమాన్యంలోని ఉన్న స్థలంలో పూనం పాండే “పోర్న్” ఫోటోషూట్‌ లో పాల్గొన్నారని స్థానిక ప్రతిపక్ష పార్టీ గోవా ఫార్వర్డ్ ఆమెపై ఫిర్యాదు చేసింది. కెనకోనాలోని చపోలి ఆనకట్ట స్థలంలో పూనమ్ రెచ్చగొట్టే ఫోటోషూట్ చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించాయి.

ఐపిసి సెక్షన్ ల కింద ఆమె మీద కేసు నమోదు చేసామని పోలీసులు పేర్కొన్నారు. అంతకు ముందు ఈ ఫోటోలకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేసామని చెప్పింది. గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పాండేపై ఫిర్యాదు చేసింది. కెనకోనా పోలీస్ స్టేషన్లో పూనం పాండే (29) తన భర్త సామ్ బొంబాయిపై కేసు నమోదు చేసారు. ఈ జంట గోవాలో హనీమూన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news