Akshay Kumar: యాక్ష‌న్ హీరో అక్కీని ఆడుకుంటున్ననెటిజన్స్‌.. కారణమేంటంటే ?

Akshay Kumar: బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్ కుమార్.. ఆయ‌న‌ గురించి ప్రత్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవలే ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సూర్య వంశీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అదే జోష్ తో అక్షయ్‌ కుమార్ ‘పృథ్వీరాజ్ అనే చిత్రంలో న‌టిస్తోన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదల చేశారు మూవీ మేక‌ర్స్. పృథ్వీరాజ్‌ చౌహన్‌ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో 2017 మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ నటించారు.

అంతా బానే ఉంది. కానీ ఈ చిత్రంలో మ‌న యాక్ష‌న్ హీరోకు ప్రియురాలిగా మానుషి నటించనుంది. ఇదే ఇప్పుడు వివాదస్పదమవుతోంది. బాలీవుడ్ యాక్షన్‌ హీరో సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నారు. తనకన్న తక్కువ వయసున్న హీరోయిన్‌తో రొమాన్స్‌ ఏంటని ప్రశ్నిస్త్నున‍్నారు నెటిజెన్స్. అక్షయ్, మానుషి మధ్య వయసు తేడా గురించి సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. అక్షయ్ కు 54 యేండ్లు, మానిషికి 24 యేండ్లు.. వీరిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ ఏంటీ అంటూ ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించారు. కొంచెం జాగ్రత్తగా హీరోలను ఎంచుకోవాలి మేడ‌మ్ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ఇదేమైనా.. భావ్యంగా ఉందా.. యాక్ష‌న్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా సోషల్ మీడియాలో కొంతమందిని నెటిజన్స్‌ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి కాంబినేష‌న్లు ఇండ‌స్ట్రీలో కామ‌నే.. ఇవీ ఎంట‌ర్ టైన్ గా తీసుకోవాలి గానీ, ఇలా ట్రోల్ చేయ‌మేంటనీ ప్ర‌శ్నిస్తున్నారు మ‌రికొంద‌రూ నెటిజన్స్‌. టాలీవుడ్ లో ఇలాంటి కాంబినేష‌న్లు కొత్త‌మే కాదు. ఇంత‌కుముందు ఎంతోమంది. తమకంటే చాలా ఏజ్‌ గ్యాప్‌ ఉన్న హీరోయిన్స్‌తో యాక్ట్‌ చేశారు. బాలయ్య సరసన శృతిహాసన్, నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ న‌టించారు.