బోరునా ఏడుస్తూ ఇన్ స్టాలో అనసూయ వీడియో.. అసలు ఏమైంది ?

-

సాధారణంగా సోషల్ మీడియాలో  అనసూయ రకరకాలుగా పోస్టులు చేస్తుంటున్న విషయం తెలిసిందే. అయితే  ఎప్పుడూ ఏ పోస్ట్ చేసినా వేల కొద్ది కామెంట్స్ చేస్తారు. వాటిని ఆమె పెద్దగా ఏమి పట్టించుకోదు. తాజాగా అనసూయ ఏడుస్తూ ఉన్న ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేసింది. దానికి ఇలా రాసుకొచ్చింది. అందరితో అన్ని విషయాలను పంచుకుంటాను. తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నాను. మీరందరూ మంచి ఆరోగ్యంతో, మంచి ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను.

ముఖ్యంగా ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే.. “అన్ని ఫోజులు, ఫొటో సూట్స్, క్యాండిడ్స్, చిరునవ్వులు నవ్వులు డ్యాన్సులు బలమైన కౌంటర్లు, పునరాగామనాలు మొదలైనవి ఇవన్ని నా జీవితంలో భాగమే. నేను అంత బలంగా లేను.. నేను బలహీనంగా ఉన్నాను. బ్రేక్ డౌన్ లున్నాయి. వాటిని మీరు కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను” అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని వారం రోజుల ముందే మీకు తెలియజేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు తెలియజేసినట్టు రాసుకొచ్చింది. అనసూయ చేసిన పోస్ట్ కి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  పర్సనల్ గా ఏమైనా సమస్యలున్నాయా..? ఇండస్ట్రీలో ఏమైనా సమస్యలున్నాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 

అనసూయ ఏడుస్తున్నటువంటి వీడియోను ఇక్కడ చూడండి. 

 

Read more RELATED
Recommended to you

Latest news