అల్లు అర్జున్ మామకు సీటు డౌటేనా.?

-

తెలుగు సినీ రంగంలో టాప్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ రాజకీయ రంగంలో కూడా పరోక్షంగా ఎంట్రీ ఇచ్చారని చెప్పవచ్చు. ఆయన డైరక్ట్ రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు కానీ.. పరోక్షంగా తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సీటు దక్కేలా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తాజాగా నాగార్జునసాగర్ లో తన మామ నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి బన్నీ వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ అభిమానులు, బి‌ఆర్‌ఎస్ శ్రేణులు భారీ స్థాయిలో స్వాగతం పలికాయి.

ఈ సందర్భంగా “ తన మామగారు కె చంద్రశేఖర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా ప్రజలకు మంచి చెయ్యాలని ఈ కన్వెన్షన్ హాల్ కట్టారు, అది ఈ వూరికి ఉపయోగపడుతుంది, అందుకు మా మామగారిని అభినందిస్తున్నాను” అని అల్లు అర్జున్ మాట్లాడారు. అంతే తప్ప రాజకీయంగా ఏమి మాట్లాడలేదు. అయితే పరోక్షంగా కంచర్ల..తన అల్లుడుని తీసుకొచ్చి బలం నిరూపించుకుని సీటు దక్కించుకోవడానికి చూస్తున్నారని తెలిసింది.

 

అయితే ఇప్పటికే కే‌సి‌ఆర్ అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వ్యతిరేకత ఉన్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని చూస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు ఈ సారి సీటు ఇచ్చే విషయంలో క్లారిటీ లేదు. ఇదే సమయంలో ఇక్కడ ఎమ్మెల్సీ కోటిరెడ్డి సైతం బి‌ఆర్‌ఎస్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పుడు బన్నీ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేసులోకి వచ్చారు.

2014 ఎన్నికల్లో కంచర్ల బి‌ఆర్‌ఎస్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి 21 వేల ఓట్లు తెచ్చుకుని నాల్గవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు తన సొంత ప్లేస్..నాగార్జునసాగర్ సీటు ఆశిస్తున్నారు. మరి కే‌సి‌ఆర్..బన్నీ మామకు సీటు ఇస్తారా? లేదా? అనేది చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news