బాల‌య్య సినిమాకు.. బ‌న్నీ టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ బోయపాటి

-

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం రూలర్.. కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే చిత్రకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ .. బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. దాంతో ఈ కాంబినేషన్లో మరో మూవీ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అభిమానులు వున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను నిర్వహించిన ఈ ఇద్దరూ త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నారు.

ఈ సినిమాలోను బాలకృష్ణ పాత్రను బోయపాటి చాలా పవర్ఫుల్ గా మలిచాడట. కథను .. బాలకృష్ణ పాత్రను దృష్టిలో పెట్టుకుంటే ‘ఐకాన్’ అనే టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని బోయపాటి భావించినట్టుగా సమాచారం. ఈ టైటిల్ ‘దిల్’ రాజు దగ్గర వుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఆయన ఈ టైటిల్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అందువలన బోయపాటి ఆ టైటిల్ కోసం ‘దిల్’ రాజును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news