వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. టాలీవుడ్ దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది చేసినా.. వివాదంలాగే ఉంటుంది.ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్‌గా మారితే ఎలా ఉంటుందనే కొత్త కథతో ఆర్జీవీ తీశాడు. ఓ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న “డేంజరస్ “లో ఇద్దరు అమ్మాయిల మధ్య రొమాన్స్‌ను హైలెట్ చేస్తున్నాడు ఆర్జీవీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి.
ఇక ఈ “డేంజరస్ “సినిమా ఏప్రిల్ 8 వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యం లో వర్మ కు షాక్ తగిలింది.”మా ఇష్టం” DANGEROUS సినిమా విడుదల విషయంలో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా థియేటర్స్ కోపరేట్ చేయలేని దృష్ట్యా సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేస్తున్నామని వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తరువాత విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు వర్మ.
మా ఇష్టం DANGEROUS సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022