బ్రేకింగ్‌: `ఆర్ఆర్ఆర్‌` షూట్ స్టార్ట్ తొలి షాట్ ఎవ‌రిపై!

-

ఏడు నెల‌ల విరామం త‌రువాత టాలీవుడ్‌లో షూటింగ్‌ల సంద‌డి మొద‌లైంది. ఈ సోమ‌వారం `ఆర్ ఆర్ ఆర్‌` షూట్ ప్రారంభ‌మైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ మొద‌లుపెట్టారు. ఇది రెండు వారాల పాటు మాత్ర‌మే జ‌రిగే స్మాల్ షెడ్యూల్ అని తెలిసింది. ఇందు కోసం టీమ్ మొత్తం క్వారంటైన్‌లోనే వుంటున్నార‌ట‌.

తొలి రోజు తొలి షాట్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌పై తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. కీల‌క ఘ‌ట్టాల‌ని ఎన్టీఆర్ సోలోగా పాల్గొన‌గా రాజ‌మౌళి క్యానింగ్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ద‌స‌రాకు ఎన్టీఆర్ కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. అందుకు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని షూట్ చేస్తున్నార‌ట‌. అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని డీవీవీ ద‌న‌య్య నిర్మిస్తున్నారు. రీలీజ్ డేట్ మ‌ళ్లీ మారే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌రిపిస్తున్నాయి. ఈ విష‌యంపై రాజ‌మౌళి ఇటీవ‌ల రిలీజ్ డేట్‌పై ఇంకా స్ప‌ష్ట‌త లేద‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news