ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా బుట్ట బొమ్మ.. సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ చైల్డ్ ఆర్టిస్టు అనికా సురేంద్రన్ మొదటిసారి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈమెతో పాటు అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శౌరీ చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ.. మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
జనవరి 26వ తేదీన ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో.. చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా నటుడు అర్జున్ దాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా లోకేష్ కనకరాజు గారి సినిమాలలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది పెరుమాళ్ సినిమా తర్వాత చాలా కాలం ఎదురు చూశాను. అప్పుడు ఖైదీ, అంధఘారం, మాస్టర్ సినిమాలు నా కెరియర్ కు మంచి జోష్ అందించాయి. ఇక సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో ఈ సినిమా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.
నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఆయన నా మీద ఎంతో నమ్మకం ఉంచి సినిమా ఖచ్చితంగా మీరే చేయాలన్నారు. మరుసటి రోజు దర్శకుడు రమేష్ చెన్నై వచ్చి నన్ను కలిసి కథ, పాత్ర గురించి వివరించారు.. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి వంశీ గారిని కలిసి ఈ సినిమాలో భాగం కావడం జరిగింది. అయితే అప్పటి వరకు నేను వంశి గారిని కలవలేదు. ఆ రోజే మొదటిసారి కలిశాను. పిలిచి మరి నాకు అవకాశం ఇస్తారు అని కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి నాకు అవకాశం లభిస్తుందని.. నేను కలలో కూడా ఊహించలేకపోయాడు అంటూ తెలుగు పరిశ్రమను ఆకాశానికి ఎత్తేస్తూ మీడియాతో మాట్లాడాడు.