‘నాగకన్య’ ట్రైలర్.. అవాక్కవడం ఖాయం…!

-

కోలీవుడ్ లో కేథరిన్ త్రెసా, వరలక్ష్మి శరత్ కుమార్, రాయ్ లక్ష్మి కలిసి నటిస్తున్న సినిమా నాగకన్య. తమిళంలో నీయ-2 గా వస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఎల్. సురేష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీధర్ అరుణాచలం నిర్మిస్తున్నారు. ఇక సినిమా కాన్సెప్ట్ విషయానికొస్తే పగలు అమ్మాయిగా రాత్రి పాములా మారే అమ్మాయి కథతో నాగ కన్య సినిమా వస్తుంది.

జై హీరోగా నటించిన ఈ సినిమాలో ఆ నాగకన్య ఎవరు అన్నది కూడా సస్పెన్స్ లో ఉంచాడు డైరక్టర్. ముగ్గురు భామల్లో కూడా నాగకన్య లక్షణాలను చూపించాడు. మరి ఇంతకీ నాగకన్య ఎవరు.. ఆమె ఏం చేసింది. అసలు కథ ఏంటి అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ట్రైలర్ చూస్తే గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవి కన్విన్స్ గా అనిపిస్తే సినిమా ప్రేక్షకులను రీచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ట్రైలర్ లో చూస్తున్నంత సేపు మాత్రం గ్రాఫిక్స్ క్వాలిటీ తగినట్టుగా లేదనిపిస్తుంది. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news