RRR రాం చరణ్ పాత్ర పేరు అదే..!

-

ఎన్.టి.ఆర్, రాం చరణ్ లను కలిపి ఓ సినిమా చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. ఆ ఆలోచనకు వారిద్దరు సై అనడం మరో విశేషం. ఈ ఇద్దరిని కలిపి తీసే సినిమా రాజమౌళిది కావడం అన్నిటికన్నా పెద్ద విశేషం. బాహుబలి సినిమాతో భారతదేశం గర్వించ దగ్గ దర్శకుల సరసన చేరిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో సంచలనానికి నాంధి పలికాడు.

పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా స్వాతంత్రం ముందు జరిగే కథగా రాసుకున్నాడట. ఇక సినిమాలో రాం చరణ్ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తుండగా.. ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగగా కనిపిస్తాడట. లేటెస్ట్ సమాచారం ప్రకారం సినిమాలో రాం చరణ్ పాత్ర పేరు రామరాజు అని తెలిసింది. రామరాజు పోలీస్ గా కనిపిస్తాడట. చేసేది బ్రిటీష్ వారి కిందే అయినా తెల్లోడిని దెబ్బ కొట్టే టైం కోసం చూసే దేశభక్తుడి పాత్రలో చరణ్ నటిస్తున్నాడట. ఇద్దరు స్టార్స్ కు తగిన కథనే ఎంచుకున్న జక్కన్న సినిమాను ఎలా తీస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news