పూరి గురించి ఫుల్ క్లారిటి ఇచ్చిన ఛార్మి..!

-

పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అన్న టైటిల్ తో ఒక సినిమాని రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ బ్యాడ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై లో కొంత భాగం చిత్రీకరణ జరిపిన అనంతరం లాక్ డౌన్ తో పూరి టీం షూటింగ్ ని నిలిపివేసి హైదరాబాద్ వచ్చేశారు.

 

ముంబై తో పాటు బ్యాంకాగ్, గోవాలోను చిత్రీకరణ జరిపేలా పూరి ముందుగానే స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా ఆ షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేశాడు. ఇక ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న పూరి కథ రాస్తూ కూర్చున్నారు. అది కూడా బాలకృష్ణ కోసం అని ఇద్దరి మద్య కథా చర్చలు జరిగాయని అంటున్నారు. కాని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పూరి విజయ్ దేవరకొండ తో తెరకెక్కిస్తున్న సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారని వార్తలు వస్తున్నాయి.

ముంబై, గోవా, బ్యాంకాగ్ లలో చేయాల్సిన సీన్స్ ని హైదరాబాద్ నేపథ్యంగా కీలక మార్పులు చేశారని న్యూస్ బాగా వైరల్ అయింది. అయితే ఈ విషయంలో నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటి ఇచ్చారు. ఇప్పటి వరకు పూరి ఫైటర్ అన్న స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయలేదని ..అసలు అంతక ముందు రాసిన స్క్రిప్ట్ ని టచ్ చేయలేదని సోషల్ మీడియాలో వస్తున్నవన్ని రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news