మెగాస్టాంప్ తో తేజూ ‘చిత్రలహరి’

-

మెగా కాంపౌండ్ లో ఏ హీరో సినిమా చేసినా తన బాధ్యతగా వారి బాగోగులు చూడాల్సిన అవసరం చిరంజీవికి ఉంది. మెగాస్టార్ ప్రమేయం లేకుండా ఆ ఫ్యామిలీ హీరోలు సినిమాలు చేయరనే చెప్పాలి. ముఖ్యంగా మెగా యువ హీరోలు చిరంజీవి సపోర్ట్ తోనే కెరియర్ లో ముందడుగు వేస్తున్నారు. సినిమా చేసే ముందు కథని చిరంజీవికి వినిపించే సలహాలు సూచనలు తీసుకుంటున్నారట. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. హిట్ లేటుగా వచ్చినా మంచి కథలతో దూసుకెళ్తున్నాడు వరుణ్ తేజ్.

ఇక మరోపక్క మెగా మేనళ్లుడు కెరియర్ సాయి ధరం తేజ్ విషయానికొస్తే కెరియర్ మొదట్లో జోష్ ఫుల్ హిట్లు కొట్టి ఇప్పుడు మాత్రం వెనుకబడ్డాడు. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు తేజూ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. అందులే చేయబోతున్న చిత్రలహరి సినిమాకు మెగాస్టార్ చిరంజీవిని ఇన్వాల్వ్ చేస్తున్నాడట సాయి ధరం తేజ్. కథ దగ్గర నుండి అన్నిటిలో చిరు ప్రమేయం ఉండేలా తేజూ పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడట. నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో దర్శకుడిగా ప్రతిభ చాటిన కిశోర్ తిరుమల తేజూ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.

మరి కిశోర్ తో తేజూ చిత్రలహరి అతని హిట్ కలను నెరవేరుస్తుందో లేదో చూడాలి. ఈమధ్యనే మొదలైన ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news