అర్థమైంది జక్కన్న గారూ.. చిరు ట్వీట్

-

మెగాస్టార్ చిరంజీవి ఉత్సాహం మీద నీరు చల్లాడు దర్శకధీరుడు రాజమౌళి. రామరాజు కోసం భీమ్ ఇచ్చే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో చూద్దామని, ఉదయం పది గంటలు ఎప్పుడు అవుతుందని ఎదురుచూసిన చిరంజీవి ఆశలు అడియాశలు అయ్యాయి. చిరు ఊపుకు రాజమౌళి బ్రేకులు వేశాడు.

రామ్ చరణ్ పుట్టిన రోజుకు ఎన్టీఆర్ ఇస్తానన్న గిఫ్ట్ రాత్రికి రాత్రే చేతులు మారిపోయిందని, ఆ గిఫ్ట్ జక్కన్న చేతికి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు. రాజమౌళి చేతికి వెళితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా అని సర్ ప్రైజ్ గిఫ్ట్ ఆలస్యం అవుతుందని రామ్ చరణ్‌కు క్షమాపణలు చెప్పాడు ఎన్టీఆర్.

అయితే ఈ మేరకు సర్ ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150 సినిమాలోని వెయిటింగ్ అనే డైలాగ్‌తో ఓ ట్వీట్ చేశాడు. అయితే సర్ ప్రైజ్ ఆలస్యం అవుతుండటంతో స్పందించిన రాజమౌళి.. సర్ అంటే అంది కొంచెం కొంచెం యాక్చువల్‌గా.. ప్లీజ్ సార్.. అంటూ నీళ్లు నములుతూ రిప్లై ఇచ్చాడు. దీనికి ప్రతి స్పందించిన చిరు ‘అర్థమైంది.. జక్కన్న గారూ..’ అంటూ సెటైర్ వేశాడు. మొత్తానికి ఆ సర్ ప్రైజ్ ఏంటన్నది సాయంత్రం 4 గంటలకు తెలిసిపోనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news