కృష్ణంరాజు మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్.. డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరిది మొగల్తూరు. కాగా, వీరిరువురి మధ్య చక్కటి అనుబంధం ఉంది. ‘మనఊరి పాండవులు’ చిత్రంలో కృష్ణంరాజుతో కలిసి చిరంజీవి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కాగా, ఆ తర్వాత ఓ ప్రముఖ దర్శకుడి చిత్రంలో కృష్ణంరాజు హీరోగా నటించగా, చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. ఆ పిక్చర్ ఇదే..

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో కృష్ణంరాజు, జయసుధ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లూ! మీకు జోహార్లు!!’. 1981లో వచ్చిన ఈ చిత్రాన్ని టి.విశ్వేశ్వరరావు నిర్మించారు. కే.వీ.మహదేవన్ సంగీతం అందించారు. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

ఇందులో భానుచందర్ కూడా నటించాడు. కాగా, మెగాస్టార్ చిరంజీవి సినిమా క్లైమాక్స్ లో గెస్ట్ రోల్ లో కనిపించి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. కృష్ణంరాజుతో చిరంజీవికి ఉన్న అనుబంధం రిత్యా ఈ గెస్ట్ రోల్ చేసేందుకు చిరంజీవి ఒప్పుకున్నారట. కె.బాలచందర్ తమిళ్ తో పాటు తెలుగు హీరోలతోనూ సూపర్ హిట్ సినిమాలు చేశారు.

కృష్ణంరాజు నటవారసుడిగా ఆయన తమ్ముడి తనయుడు ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి అందరికీ విదితమే. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతి పట్ల ప్రభాస్ అశేష అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.