మెగాస్టార్ చిరంజీవి అర్బన్‌ మాంక్ లుక్ సీక్రెట్ ఇదే..

మెగాస్టార్‌ చిరంజీవి గుండుతో ఉన్న ఫొటో ఇటీవ‌ల సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిం దే. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన అనేక మంది హీరోలు, హీరోయిన్లు, ఇత‌ర ప్ర‌ముఖులు ఈ ఫొటోపై స్పందిం చారు. చిరు స‌రికొత్త గెట‌ప్ బాగుందంటూ ప్ర‌శంస‌లు కూడా కురిపించారు.

అయితే చిరంజీవి ఏ సినిమా కోసం గుండు కొట్టుకున్నారు? అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. చిరు తన 152వ సినిమా ‘ఆచార్య’ కోసం అర్బన్‌ మాంక్‌ లుక్‌లో కనపడబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా చిరంజీవి తన లుక్‌ వెనకున్న సీక్రెట్‌ను రివీల్‌ చేశారు. మెగాస్టార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు అర్బన్‌ మాంక్‌ లుక్‌లోకి తాను ఎలా మారాననే విషయాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. “నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్‌” అని చిరు వీడియోతో పాటు మెసేజ్‌ కూడా షేర్‌ చేశారు. తన అర్బన్ మాంక్ లుక్ వెనకున్న సీక్రెట్ ప్రాస్థటిక్ మేకప్ అనే మొత్తానికి రివీల్ చేశారు మెగాస్టార్.