Mahesh Marriage Anniversary : ప్లైట్‌ లో మహేష్‌ బాబుకు బిగ్‌ ట్రీట్‌ ఇచ్చిన చిరంజీవి..

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట మహేష్‌ బాబు – నమ్రతదే. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. టక్కరి దొంగ సినిమాలో నమ్రత – మహేష్‌ బాబు ఇద్దరూ నటించారు. ఆ సినిమా సమయంలోనే… మహేష్‌ బాబు – నమ్రత ఇద్దరూ లవ్‌ లో పడ్డారు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకుని.. ఇద్దరికి జన్మనించారు కూడా. ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేకుండా.. వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే… ఇవాళ మహేష్‌ బాబు – నమ్రత 17 వ మ్యారేజ్‌ యానీవర్సరీ. ఈ నేపథ్యంలోనే.. టాలీవుడ్‌ హీరో మెగాస్టార్‌ చిరంజీవి.. రాజమౌళి, ప్రభాస్‌ అందరూ కలిసి.. మహేష్‌ బాబుకు బిగ్‌ ట్రీట్‌ ఇచ్చారు. ఇవాళ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసేందుకు.. స్పెషల్‌ ఫ్లైట్‌ లో ఉదయం బేగంపేట నుంచి బయలు దేరారు ఈ స్టార్లు. అయితే ఫ్లైట్‌ ఎక్కిన తర్వాత… పూల బకేట్‌ ఇచ్చి.. మహేష్‌ బాబు యానివర్సరీ శుభాకాంక్షలు చెప్పారు టాలీవుడ్‌ స్టార్లు. ఈ మేరకు మెగాస్టార్‌ చిరంజీవి దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news