టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరో వైపున టైమ్ దొరికినప్పుడల్లా పొలిటికల్ మీటింగ్స్ లో కనిపిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ లో పవర్ స్టార్ జాయిన్ అవుతారని టాక్.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మరో చిత్రానికి సైన్ చేయబోతున్నారని గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. తమిళ్ నటుడు, దర్శకుడు సముద్రఖని సైతం ఈ సినిమా గురించి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అదే ‘వినోదయ సిత్తం’ రీమేక్. తెలుగులో దీనిని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయాలని, దానికి తానే దర్శకత్వం వహించాలని అనుకుంటున్నట్లు సముద్రఖని చెప్పుకొచ్చారు.
త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఈ పిక్చర్ రీమేక్ పైన స్పష్టతనివ్వడం లేదని టాక్.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో కలిసి నటిస్తారనే వార్తలొస్తున్నాయి. కానీ, ఈ రీమేక్ ఉన్నట్లా? లేనట్లా? అనేది ఇంకా తేలడం లేదు. మరో వైపున పవన్ కల్యాణ్ ..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ అనే సినిమా చేయాల్సి ఉంది. ఈ పిక్చర్ కు వక్కంతం వంశీ స్టోరి అందించనున్నారు. చూడాలి మరి..‘వినోదయ సిత్తం’ రీమేక్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందో..