సిఎం టూ స్టూడెంట్.. మహేషా మజాకా..!

-

 

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కానుకగా వచ్చిన మహర్షి సినిమా టీజర్ లో మహేష్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాడు. స్టైలిష్ వాక్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన మహేష్ ఈ క్రేజీ మేకోవర్ ఫ్యాన్స్ అందరిని ఫిదా అయ్యేలా చేసింది. రీసెంట్ గా మహేష్ థియేటర్ ల నుండి వెళ్లిన భరత్ అనే నేను లో పద్ధతిగా సిఎం లుక్ లో కనిపించి అలరించిన మహేష్ మహర్షి సినిమాలో మరోసారి పోకిరి స్టైల్ లో కనిపించాడు.

సిక్స్ ప్యాక్ బాడీ.. స్టైలిష్ లుక్.. మహర్షిలో రిషి ఎన్నో కొత్త అనుభూతులు అందించేలా ఉన్నాడు. సిఎం టూ స్టూడెంట్ గా మహేష్ మేకోవర్ నిజంగా వావ్ అనేలా ఉంది. సినిమా కథల విషయంలోనే కాదు లుక్ విషయంలో కూడా ఇక నుండి మహేష్ కొత్తగా చేయబోతాడని తెలుస్తుంది.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ మహర్షి సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news