The Warriorr : వారియర్ నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘‘ ది వారియర్’’. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా, శ్రీనివాసా చిట్టూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ వచ్చే నెల 14న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే… తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్‌ సాంగ్‌ ను విడుదల చేశారు. కలర్స్‌ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పాట లో రామ్ పోతినేని జీవించేశారు.

ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చక్కగా అందించారు. ట్రైలర్ లో నదియా చాలా శక్తిమంతమైన మహిళగా కనిపించింది. ఇక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యగా..రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని సమచారం. ఇక ఈ అప్ డేట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news