రూ.2కోట్లు ఇవ్వ‌డానికి రెడీ అయిన క‌మెడియ‌న్ వ‌డివేలు.. దేనికోస‌మంటే?

అదేంటో గానీ డైరెక్ట‌ర్ శంకర్‌కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ఇండియ‌న్ -2 వివాదంతో ఆయ‌న స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే ఆయ‌న ఇదివ‌ర‌కే నిర్మించిన ఓ సినిమా విష‌యంలో ఇప్పుడు మ‌ళ్లీ వివాదాస్ప‌దం అవుతున్నారు. కాగా ఆయ‌న నిర్మించిన సినిమా ఇప్పుడు మ‌ళ్లీ ప‌ట్టాలెక్క‌బోతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

డైరెక్ట‌ర్ శంక‌ర్ నిర్మించిన పులికేశి అనే రాజు కథను అప్ప‌ట్లో కమెడియన్ వడివేలుతో కలిసి నిర‌మ్ఇంచాడు. ఇది మంచి హిట్ కొట్టింది. అప్ప‌ట్లో ఇది పెద్ద సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. అయితే దీనికి సీక్వెల్‌గా హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి పేరుతో సినిమాను తీయాల‌ని, అది కూడా వ‌డివేలుతో చేయాల‌ని డైరెక్ట‌ర్ శంకర్ నిర్ణ‌యించాడు.

కానీ షూటింగ్ మ‌ధ్య‌లో త‌న‌కు తెలియ‌కుండా క‌థ‌లో మార్పులు చేశార‌ని క‌మెడియ‌న్ వడివేలు షూటింగ్ కి రాకుండా ఉండ‌టంతో.. డైరెక్ట‌ర్ శంకర్ కు వడివేలుకు అప్ప‌ట్లో పెద్ద ఎత్తున మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. దీంతో శంక‌ర్ నిర్మాతల మండలిలో అప్ప‌ట్లోనే కంప్ల‌యింట్ కూడా చేశారు. వ‌డివేలు వ‌ల్ల త‌న‌కు రూ.2కోట్ల వ‌ర‌కు న‌ష్టం వ‌చ్చింద‌ని శంక‌ర్‌చెప్పాడు. దాంతో మిగ‌తా నిర్మాత‌లు వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదుర్చ‌డానికి ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌లేదు. అయితే ఇప్పుడు వ‌డివేలు రూ.2కోట్లు చెల్లించడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.