మరో కొత్త టెన్షన్ : డెల్టా వేరియంట్ వైరస్ తో సింహం మృతి

-

మన దేశంలో మరో కొత్త టెన్షన్ మొదలైంది. సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్ సోకుతున్నట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. తమిళనాడు లో కరోనా తో మరో సింహం మృతి చెందింది. ఈ సింహం కు డెల్టా వేరియంట్ వైరస్ సోకినట్లు సమాచారం. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల మూడో తేదినా నీలా అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం మృతి చెందగా.. జూన్ 16 న పద్మనాధన్ అనే 12 ఏళ్ళ సింహం మృతి చెందింది.

మొత్తం 11 సింహాలలో 9 సింహాలను కరోనా పాజిటివ్ సోకింది. వాటిలో నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్ సోకినట్లు నిర్ధారించింది భూపాల్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసిసస్. ఇక లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల జూలాజికల్ పార్క్ మూసి ఉంది. పార్క్ మూసి ఉన్నప్పటికీ కరోనా విలయ తాండవం చేయడం అందరినీ కలవరపెడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news