సుధీర్‌తో రష్మీ పెళ్లి నిజమేనట… కానీ…!

-

సుడిగాలి సుధీర్ – జ‌బ‌ర్ద‌స్త్ ర‌ష్మీ జంట ప్రేమ‌, పెళ్లి వ్య‌వ‌హారంపై ఎప్ప‌టి నుంచో వార్త‌లు చిలువ‌లు ప‌లువ‌లుగా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓ స్నేహితుడి సాయంతో మ్యూజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్న సుధీర్ ఆ త‌ర్వాత ఈ టీవీలో కామ‌న్‌మేన్‌గా ఎంట్రీ ఏకంగా ఓ టీంను నెల‌కొల్పాడు. నేడు జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఏకంగా ఓ పాపుల‌ర్ యాక్ట‌ర్‌గా మారిపోయాడు.

అలానే ఆ షో ద్వారా యాంకర్ గా ఎంతో పాపులరైన రష్మీ గౌతమ్, ఆ ఇటీవల కొన్ని సినిమాల్లో కూడా నటించింది. జ‌బ‌ర్ద‌స్త్ గురించి ప్ర‌తి ఒక్క‌రు మాట్లాడుకున్నారంటే అందులో ర‌ష్మీ – సుధీర్ ప్ర‌స్తావ‌న రాకుండా ఉండ‌దు. వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని… త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కొద్ది రోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.

ఈ పెళ్లి వార్త‌లు ఇద్ద‌రూ ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తున్నా ఇవి మాత్రం ఆగ‌డం లేదు. వీరి పెళ్లి గురించి వీరికే కాదు జ‌బ‌ర్ద‌స్త్ న‌టులు ఎక్క‌డికి వెళ్లినా వాళ్ల‌కు కూడా ప్ర‌శ్న‌లు త‌ప్ప‌వు. ఇక జ‌బ‌ర్ద‌స్త్‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కులు కూడా కొంద‌రు జ‌బ‌ర్ద‌స్త్ యాక్ట‌ర్స్‌కు ఇదే ప్ర‌శ్న వేయ‌గా వారు ప్ర‌శ్న వేసిన వాళ్ల‌కు షాక్ అయ్యేలా ఆన్స‌ర్ ఇచ్చారు.

ర‌ష్మీ – సుధీర్ మ‌ధ్య మీరు అనుకుంటోన్న సంబంధం లేదు. వారు మంచి స్నేహితులు… అయితే వారి పెళ్లి జ‌రుగుతుంద‌న్న మాట నిజ‌మే అని… అయితే అది రియ‌ల్‌గా కాదు… మా షోలోనో లేదా ఏదైనా ప్రోగ్రామ్‌లోనే జ‌ర‌గ‌వ‌చ్చ‌ని చెప్పారు. దీనిని బ‌ట్టి వారిద్ద‌రి పెళ్లిపై వ‌స్తోన్న వార్త‌లు మ‌రోసారి పుకార్లే అని ఫ్రూవ్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news