ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి బాలకృష్ణ అభినందనలు

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి బాలకృష్ణ అభినందనలు చెప్పారు నందమూరి బాలకృష్ణ. నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం అని కొనియాడారు నందమూరి బాలకృష్ణ. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిని విజయమిది.. కీరవాణి, చంద్రబోస్‌.. ఆర్‌ఆర్ఆర్‌ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు నందమూరి బాలకృష్ణ.

ఇలాగే తెలుగు చిత్ర పరిశ్రమ వర్ధిల్లాలని పేర్కొన్నారు. అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్​ఆర్ఆర్ టీమ్​కు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘రాజమౌళి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు. నాటునాటుకు ఆస్కార్‌తో భారత్‌ గర్వపడుతోంది. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. నాటునాటు పాటను ఏళ్ల తరబడి స్మరించుకుంటారు.’ అని ప్రధాని ట్వీట్ చేశారు.