థియేటర్లు ఊగిపోయే మరో కాంబినేషన్..శంకర్-తారక్ మూవీకి దిల్ రాజు ప్లాన్?

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో RC 15 సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కమల్ హాసన్ తో ఇండియన్-2 చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. 60 శాతం సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత క్రేన్ ప్రమాదం, ప్రొడ్యూసర్స్ తో వివాదం వలన ఫిల్మ్ షూట్ ఆగిపోయింది.

ఈ క్రమంలోనే శంకర్..రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. కాగా, ఆ తర్వాత శంకర్…టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు న్యూస్ సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది.

తారక్ ప్రస్తుతం..కొరటాల శివ దర్శకత్వంలో NTR30 ఫిల్మ్ చేస్తున్నారు. ఆ తర్వాత KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ తో NTR31 చేస్తున్నారు. ఆ తర్వాత తారక్ తో శంకర్ సినిమా చేసే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news