Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’లో యాక్షన్ నెక్స్ట్ లెవల్..పవన్ కల్యాణ్ అభిమానులకు పండుగే

-

తెలుగు సినీ ప్రేక్షకులు, పవన్ కల్యాణ్ అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నదని ఇప్పటికే విడుదలైన పోస్టర్, వీడియో ద్వారా అర్థమవుతోంది. తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను పవన్ కల్యాణ్ మరోసారి వెండితెరపైన ఆవిష్కరించనున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మొఘలుల కాలం నేపథ్యంలో నాటిది. కాగా, ఈ పిక్చర్ కు ఆర్ట్ డైరెక్టర్ గా లెజెండరీ, పద్మశ్రీ తోట తరణి పని చేస్తున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం.. పవన్ కల్యాణ్ ఈ పిక్చర్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ను 1,000 మంది ఆర్టిస్టులతో తెరకెక్కిస్తున్నారట. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ను నెవర్ బిఫోర్ అవతార్ లో చూడబోతున్నారు సినీ ప్రేక్షకులు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం ర‌త్నం స‌మ‌ర్పణ‌లో ఏ.ద‌యాక‌ర్ రావు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇందులో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పాటు కోట శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘భీమ్లానాయక్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న పవన్ కల్యాణ్ ప్రజెంట్ ఓ వైపున ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపున ‘భవదీయుడు భగత్ సింగ్ ’ చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news