క్రేజీ కాంబో..తమిళ్ దర్శకుడితో తారక్ సినిమా?

RRR సినిమాత్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన నెక్స్ట్ ఫిల్మ్ కోసం సినీ అభిమానులు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. తారక్ సైతం..తన తదుపరి చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేస్తుండటం విశేషం.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NTR30 ని పాన్ ఇండియా ఫిల్మ్ గా దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ వీడియో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 పిక్చర్ చేస్తున్నాడు తారక్. కాగా, ఈ సినిమాపైనా భారీ అంచనాలు ఏర్పడగా, ఫస్ట్ లుక్ విడుదల చేశారు ప్రశాంత్.

తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం..తమిళ్ క్రేజీ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇందుకుగాను డైరెక్టర్ వెట్రిమారన్ స్టోరి కూడా రెడీ చేశారని కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. మరో వైపున ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానాతో తారక్..ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి..NTR32 ఫిల్మ్ ను తారక్..బుచ్చి బాబు సానాతో చేస్తారా? లేదా వెట్రిమారన్ తో చేస్తారా?..