సీనియ‌ర్ క్రికెట‌ర్‌తో హ‌న్సిక హీరోయిన్ రొమాన్స్‌

-

సౌత్‌లో తిరుగులుని స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్న హ‌న్సిక కెరీర్ ప‌రంగా వేసిన రాంగ్‌స్టెప్పుల‌తో ద‌బేల్ మ‌ని కింద ప‌డిపోయింది. చాలా చిన్న వ‌య‌స్సులోనే దేశ‌ముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ త‌ర్వాత వ‌రుస‌గా తెలుగులో సైతం స్టార్ హీరోల‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. బ‌న్నీతో ఆమె కెరీర్ స్టార్ట్ అయినా ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో కంత్రి సినిమాలో కూడా ఆడిపాడింది.

ఆ త‌ర్వాత శింబు, ఉద‌య‌నిధి స్టాలిన్ లాంటి వాళ్ల‌తో ఆమె ఎఫైర్లు న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఆమె సినిమాలు చేస్తున్నా ఫేడ‌వుట్ అయిపోయింద‌న్న‌ది మాత్రం నిజం. ఆమె ప్ర‌స్తుతం తెలుగులో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ సినిమాలో న‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆమె కొద్ది రోజులుగా ఇష్ట‌ప‌డుతూ చేస్తూ వ‌స్తోన్న హ‌ర్ర‌ర్ జాన‌ర్ సినిమాల స్టైల్లోనే మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది.

ఇంత‌కు ఈ సినిమాలో ఆమె ఓ మాజీ ఇండియ‌న్ క్రికెట‌ర్‌తో న‌టించ‌నుంది. ఈ సినిమాలో హ‌న్సిక స‌ర‌స‌న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటిస్తాడని తెలుస్తోంది. అది కూడా ప్రతినాయకుడి పాత్రలో కావడం విశేషం. హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. వీరు గతంలో ‘అంబులి’ అనే తమిళ సినిమాను డైరెక్ట్ చేశారు.

అటు క్రికెట్‌కు దూర‌మైన శ్రీశాంత్‌.. ఇటు ఫేడ‌వుట్ హీరోయిన్ హ‌న్సిక కాంబోలో వ‌చ్చే ఈ సినిమా ఎలా ? ఉంటుందో ? చూడాలి. ఇదిలా ఉంటే శ్రీశాంత్ గతంలో ‘టీమ్ 5’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version