ఐపీఎల్ ఆటగాడు జెర్సీ సీన్ లా ఏడ్చేశాడా..!

Join Our Community
follow manalokam on social media

ఐపీఎల్ 14వ సీజన్ లో చెన్నై జట్టులో ఎంపికయ్యాడు హరి శంకర్ రెడ్డి. ఫిబ్రవరిలో జరిగిన మినీ ఐపీఎల్ లో ఎమ్మెస్ ధోని బౌల్డ్ చేయడంతో అతనికి ఐపీఎల్ లో బెర్త్ కన్ఫాం అయ్యింది. తెలుగుతేజం హరి శంకర్ రెడ్డి తను సీ.ఎస్.కే జట్టుకి సెలెక్ట్ అయిన సందర్భంలో నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్ లా అతను కూడా ఒక రూం లోకి వెళ్లి అమ్మా అని గట్టిగా అరిచేశాడట. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జెర్సీ సినిమాతో తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు హరి శంకర్ రెడ్డి.

ఆ సినిమా ప్రతి ప్లేయర్ కు కనెక్ట్ అవుతుంది. తనకు ఆ సినిమా బాగా నచ్చిందని.. ఈ స్పెషల్ వీడియోని నానికి ట్యాగ్ చేయగా.. నాని రిప్లై ఇస్తూ చూసేశా అని లవ్ సింబల్ పెట్టాడు. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు హరి శంకర్ రెడ్డి. జెర్సీ సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. జెర్సీకి ప్రాంతీయ తెలుగు సినిమా అవార్డ్ తో పాటుగా బెస్ట్ ఎడిటర్ గా నవీన్ నూలికి నేషనల్ అవార్డ్ వచ్చింది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...