సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన అవసరం అన్నారు ప్రముఖ సినీ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి. 80 శాతం నేరాలు ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయన్నారు రాజమౌళి. సైబర్ నేరగాళ్లు అమయకులను రకరకాలుగా బురిడీ గోట్టిస్తున్నరని.. మా షూటింగ్ సేట్ వర్క్ లో ఉన్న ఓ వ్యక్తి కి సైతం సైబర్ కాల్ వచ్చిందన్నారు. బ్యాంక్ మేనేజర్ అని చెప్పడంతో అతడు ఓటిపి చెప్పాడు. దీంతో 10 నెలల వేతనం అతని బ్యాంక్ ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు కొట్టేసారని వివరించారు.
డబ్బుపై దురాశతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు రాజమౌళి. కష్టపడి సంపాదించే డబ్బుతో వచ్చే ఆనందం వేరు.. ఈజీగా వచ్చే మని మోసానికి దారితీస్తుందన్నారు. చిన్నప్పటి నుంచే మన పిల్లలకు కష్టం అంటే ఎంటో నేర్పించాలని సూచించారు రాజమౌళి. సైబర్ నేరాలపై తెలుగులో ప్రజలకు అవగాహన కలిగేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.