అలాంటి వ్యాధితో బాధపడుతున్న దంగల్ హీరోయిన్..!

-

ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అరుదైన వ్యాధితో కొంతమంది హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా మరింతగా బాధపడుతున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా తెరపై ముఖంలో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇలా ఎంతోమంది హీరో హీరోయిన్స్ కెరియర్ వెనుక దాగివున్న అసలు విషయాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కన్నీరు ఆగదనే చెప్పాలి. అంతలా తమ బాధను పెట్టుకొని ప్రేక్షకులను అలరించడానికి బాధను మరిచిపోయి మరి నటిస్తూ ఉంటారు. అందుకే వీరికి ప్రతి ఒక్కరూ ఫిదా అవతారనడంలో సందేహం లేదు.

ఇకపోతే నిన్నటికి నిన్న స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత మయో సిటీస్ వ్యాధి బారిన పడ్డాను అని తెలిపి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అంతేకాదు ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని ఇప్పటికీ ఆకాంక్షిస్తున్నారు.. మరొకవైపు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపాటు. అయితే వీటన్నింటి గురించి తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరొక బాలీవుడ్ హీరోయిన్ కూడా తనకు మూర్చవ్యాధి ఉందని తెలిపి అందరిని మరొకసారి ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆమె ఎవరో కాదు దంగల్ సినిమా ద్వారా భారీ పాపులారిటీని అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సన తనకు మూర్ఛ వ్యాధి ఉందని షాకింగ్ న్యూస్ చెప్పింది. దంగల్ సినిమా కోసం శిక్షణ పొందుతున్న సమయంలోనే వ్యాధి నిర్ధారణ అయిందని ఆమె వెల్లడించింది . ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే తన కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు లభించడం వల్ల తాను బలంగా ఉండగలుగుతున్నాను అని కూడా ఫాతిమా చెప్పింది. ఈ విషయం తెలియడంతో అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version