ఫెమినా మిస్ ఇండియా-2022 పోటీల‌కు స్టార్ హీరో కూతురు

-

ఫెమినా మిస్ ఇండియా – 2022 పోటీల‌కు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ శేఖ‌ర్ పెద్ద కూతురు, న‌టి శివాని పాల్గొన‌నున్నారు. ఈ విషయాన్ని న‌టి శివాని సోమ వారం అధికారింగా ప్ర‌క‌టించింది. తనుకు ఫెమినా మిస్ ఇండియా – 2022 లో అవ‌కాశం ఇచ్చినందకు నిర్వ‌హ‌కులుకు ధ‌న్యవాదాలు తెలిపింది. సోమ‌వారం దీని కోసం ఆడిషన్స్ కూడా జ‌రిగాయ‌ని న‌టి శివాని తెలిపింది. ఈ ఆడిషన్స్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న కూడా ఇచ్చిన‌ట్టు తెలిపింది.

ఇక తాను కొత్త ప్ర‌యాణానికి చేయ‌బోతున్నాన‌ని తెలిపింది. దీనికి స‌హకారం కావాల‌ని న‌టి శివాని కోరింది. కాగ న‌టి శివాని టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ శేఖ‌ర్ – జీవిత పెద్ద కూతురు. గ‌త ఏడాది అద్భుతం అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. అలాగే రాజ శేఖ‌ర్ హీరోగా వ‌స్తున్న శేఖ‌ర్ అనే సినిమాలో న‌టి శివాని ఓ కీలక పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ శేఖ‌ర్ సినిమాకు జీవిత డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news