రోప్స్ తో లుంగీ డ్యాన్స్ చేసిన స్టార్ హీరోయిన్,వైరల్ అవుతున్న వీడియో

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన శరీరాకృతి విషయంలో ఎంతగా శ్రద్ద తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. లేచిన దగ్గర నుంచి దీపికా ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటుంది. అందుకే రోజూ జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ బిజీ గా ఉండే దీపికా తాజాగా జిమ్ లోనే లుంగీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వర్కవుట్స్ టైమ్ లో రోప్స్ తో చేస్తున్న దీపిక లుంగీ డ్యాన్స్ కూడా చేసింది. అయితే దీపికా జిమ్ ట్రైనర్ యాస్మిన్ కరాచీ వాలా ఈ వీడియో ను తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. వేకువజామునే 6 గంటలకు కష్టపడేతత్వం, వినోదం సమపాళ్లలో కలిస్తే దీపికా వర్కవుట్‌ సెషన్‌ వీడియో అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది యాస్మిన్‌ కరాచీవాలా. దీపికా, షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలోని లుంగీ డ్యాన్స్‌ పాట ఏ రేంజ్‌ సూపర్‌హిట్టయిందో అందరికీ తెలిసిందే. అయితే దీపికా అదే సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2018 నవంబర్ లో స్టార్ హీరో రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకొన్న దీపికా ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఓం శాంతి ఓం తో అడుగుపెట్టిన దీపికా తోలి సినిమా లోనే కింగ్ ఖాన్ షారూక్ పక్కన నటించింది. ఆ చిత్రం విజయం అందుకోవడం తో ఇక ఆమె వెనుదిగిరి చూసుకోలేదు. కొద్దీ కాలం లోనే దీపికా బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Read more RELATED
Recommended to you

Latest news