ఆస్కార్ వేదికగా ‘నాటు నాటు’ పర్ఫామెన్స్.. పాటను ఇంట్రడ్యూస్ చేసిన బాలీవుడ్ దివా దీపికా పదుకొనె

2023 ఆస్కార్‌ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు తరలివచ్చారు. డిఫరెంట్ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తూ రెడ్ కార్పెట్​పై సందడి చేశారు. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా పాట సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట లైవ్ పర్ఫామెన్స్ జరిగింది. ఈ పాటను ఆస్కార్ వేదికపై బాలీవుడ్ దివా దీపికా పడుకోన్ ఇండ్రడ్యూస్ చేసింది. ఆ పాట నేపథ్యాన్ని, అవార్డుల వేడుకకు హాజరైన వారికి వివరించింది.

ఆస్కార్‌-2023 వేడుకల్లో తెలుగు పాట ‘నాటు నాటు’ అదరగొట్టింది. గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో పాడగా, వెస్ట్రన్‌ డ్యాన్సర్‌ తమ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఈ పాట ప్రదర్శన సమయంలో ఆస్కార్‌ వేడుకకు వేదికైన డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

ఇక ఆస్కార్ వేడుకకు ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ హాజరైంది. ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి, సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, లిరిసిస్ట్ చంద్రబోస్, నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ హాజరయ్యారు.