నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకం – రేవంత్ రెడ్డి

-

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకం అని తెలిపారు రేవంత్ రెడ్డి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ లభించింది. ఈ నేపథ్యంలోనే..జక్కన్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. RRR సినిమా బృందానికి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెబుతూ…ట్వీట్‌ చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అన్నారు రేవంత్‌ రెడ్డి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకమన్నారు. సినిమా బృందానికి దర్శకులు రాజమౌళి, పాట రచయిత, గాయకులు, సంగీత దర్శకులు, నటులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news