క్యూట్ స్మైల్ తో ఆగంజేస్తున్న దీపికా

క్యూట్ స్మైల్ తోని ఓ పిల్ల టిక్ టాక్ ను ఆగం జేసింది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఏకంగా ఢీషోలో అడుగుపెట్టి దూసుకుపోతోంది. ఇంకా గుర్తుకు రాలేదా.. ఆమెనే నండి దీపికా పిల్లి. ఈ పిల్లకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఎప్పుడు ఏ పోస్టు పెడుతుందా అని లక్షల మంది ఎదురుచూస్తుంటారు ఆమె అభిమానులు. పోస్టు చేయడం ఆలస్యం వెంటనే దాన్ని వైరల్ చేసేస్తారు. దీపికకు ఇదే ప్లస్ పాయింట్.

ఇప్పుడు ఢీ 13లో ఎక్కువగా రచ్చ చేస్తోంది. రష్మీకి జోడీగా నటిస్తోంది. అయితే ఈ షోలో పెద్దగా డైలాగులు లేకున్నా.. తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది. చాలామంది దీపికను చూసేందుకు ఈ ప్రోగ్రాం చూస్తున్నారంటే నమ్మండి. ఆదితో ఈ అమ్మడు చేసే డ్యాన్సులు తెగ ఆకట్టు కుంటున్నాయి. బుల్లితెర మీర నటిస్తానని తాను అనుకోలేదని దీపికి పలు మార్లు చెప్పింది. ఈ షోలతో పాటు ఈ పిల్ల లంగాఓనిలో షేర్ చేసే ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఈ ముద్దుగుమ్మ చాలా మందికి క్రష్ గా మారిపోయింది.

ఇక ఈ అమ్మడు లేటెస్టుగా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు దుమ్ములేపుతున్నాయి. కుర్రాళ్ల వాట్సాప్ డీపీలుగా మారిపోయాయండి. మరి ఏం అనుకున్నారు. అచ్చం తెలుగింటి నిండైన అమ్మాయిలా ఉంటుంది కాబట్టే దీపకకు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. మరి ఈ పిల్ల కొత్త ఫొటోలను మీరు కూడా చూసేయండి.