రౌడీ బేబీ సాంగ్ మేకింగ్ వీడియో.. ఇది కూడా సంచలనమే..!

-

ఈమధ్య సోషల్ మీడియాని షేక్ ఆడించేసిన సాంగ్ ఏదైనా ఉంది అంటే అది మారి-2లోని రౌడీ బేబీ సాంగ్ అని చెప్పొచ్చు. సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు కాని రౌడీ బేబీ సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ధనుష్, సాయి పల్లవి డ్యుయెట్ సాంగ్ వచ్చిన ఆ పాటని ప్రభుదేవా కంపోజ్ చేయడం జరిగింది. అందుకే ఆ సాంగ్ కు అంత క్రేజ్ వచ్చింది. స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ లో కుమ్మేసింది.

ఆల్రెడీ యూట్యూబ్ లో ఫిదాలోని వచ్చిండే సాంగ్ తో రికార్డ్ వ్యూయర్స్ సాధించిన సాయి పల్లవి ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్ తో 250 మిలియన్ వ్యూస్ తో సరికొత్త సంచలనాలు సృష్టించింది. ఇంతమందికి నచ్చిన ఈ సాంగ్ మేకింగ్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో సందడి చేస్తుంది. బాలాజీ మోహన్ డైరక్షన్ లో వచ్చిన మారి-2లో ఈ సాంగ్ ఎలా అనుకున్నారు.. ఎలా వచ్చింది.. రిహార్సెల్స్ ఎలా జరిగాయి అన్నది మేకింగ్ వీడియోలో చూపించారు.

విషయం ఏంటంటే ఈ మేకింగ్ వీడియో కూడా యూట్యూబ్ లో ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్ సాదించింది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సాయి పల్లవి క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news