తన తండ్రి చెప్పిన మాటలే మహేష్ ను స్టార్ చేశాయా..?

-

సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరపై చేయని సాహసాలు లేవు.. ప్రయోగాలు లేవు.. ఎడారుల్లో కూడా వర్షం కురిపించిన ఘనత ఆయనది.. అంతలా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం. సోమవారం ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా చేరిన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కాంటినెంటల్ వైద్యులు ప్రకటించారు. కృష్ణ దాదాపు 340 చిత్రాలకు పైగా నటించారు. ఎన్టీఆర్ ను కాదని ఆయన చేసిన అల్లూరి సీతారామరాజు చిత్రం తెలుగు సినిమా ఉన్నంతకాలం ఉంటుంది. అలాగే టాలీవుడ్ కి జేమ్స్ బాండ్ , కౌబాయ్ అంటే మొదటగా గుర్తొచ్చేది కృష్ణ పేరు మాత్రమే . అంతలా అభిమానులు ఆయన చిత్రాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఆయన మరణం ప్రతి ఒక్కరిని మరింతగా ఇబ్బందికి గురి చేసింది.

ఇదిలా ఉండగా కథల విషయంలో తన తండ్రి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తొలి సినిమా తర్వాత నుంచి కథల విషయంలో మహేష్ బాబు నిర్ణయం తీసుకునేవారు. కృష్ణ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు.” నీ కష్టం నువ్వే పడాలి” అని చెప్పే వారట. అలా మురారి ప్రివ్యూ చూసి సినిమా పూర్తి అయిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మహేష్ బాబు భుజంపై సంతోషంతో అలా తట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే దాని అర్థం ఆయనకు మహేష్ బాబు సినిమా, మహేష్ బాబు యాక్టింగ్ అమితంగా నచ్చిందని అర్థం. అదే తన లైఫ్ లో పెద్ద కాంప్లిమెంట్ అని మహేష్ బాబు తెలిపారు.

అంతేకాదు తన నటన బాగా లేనప్పుడు విమర్శలు కూడా చేశారట కృష్ణ. మహేష్ బాబు మాట్లాడుతూ.. నేను నటించిన నాని సినిమా ఒక ప్రయోగాత్మకమైన చిత్రం. ఆ మూవీ ప్రివ్యూ ని నాన్నగారికి చూపించాం.. మూవీ పూర్తయ్యాక నాన్న చెప్పిన మాటలు నాకు వేకప్ కాల్ లాంటివి. ” ఈ సినిమా హిట్ అయితే మహేష్ ఎప్పటికీ స్టార్ కాలేడు ” అని అన్నారట. అంటే దాని అర్థం ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా కాదు ఇది. నాన్న చెప్పినట్లుగానే ఆ చిత్రం బాగా ఆడలేదు. నాన్న మాటల ద్వారా ఒక స్టార్ హీరో ఎలాంటి సినిమాలు చేయాలో.. చేయకూడదో తెలుసుకున్నాను.. అంటూ మహేష్ బాబు తెలిపారు. అలా మొత్తానికి తండ్రి మాటలను ఆచరణలో పెట్టి స్టార్ హీరోగా ఎదిగారు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news