సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణం పట్ల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన తుది శ్వాస విడిచారు అనే విషయం ఎంతో ఆవేదన కలిగించిందని అన్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
” చిత్ర సీమలో సూపర్ స్టార్ బిరుదుకి స్మార్తకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.
మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరపున జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని అన్నారు.
శ్రీ కృష్ణ గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MuLsGyrzbO
— JanaSena Party (@JanaSenaParty) November 15, 2022