మహేష్, పవన్ దృష్టి పాన్ ఇండియా సినిమాలపై పడిందా ….??

-

ఒకప్పటితో పోలిస్తే సౌత్ సినిమాల పరిధి మరింతగా విస్తృతం అవుతోంది. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలు తర్వాత, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కూడా టాలీవుడ్ వైపు చూడసాగింది. దానితోపాటు ఇకపై తెరకెక్కే సినిమాలు కూడా కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయ్యేలా పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కడం అనే సంస్కృతి మొదలైంది. బాహుబలి తర్వాత కన్నడలో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమా పాన్ ఇండియా మూవీ గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్,

ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2, అలానే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న ఫైటర్ కూడా పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నవే. ఇక ఈ తరహా సినిమాలపై టాలీవుడ్ సూపర్ స్టార్లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల దృష్టి కూడా పడినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తదుపరి నటించబోయే సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం ప్రఖ్యాత సోనీ సంస్థ వారు దీనిని పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కించేందుకు ముందుకు వచ్చినట్లు నిన్నటినుండి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 

అలానే అతి త్వరలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమా కూడా పీరియాడికల్ మూవీగా సాగడం తో పాటు, భారీ స్థాయిలో పాన్ ఇండియా ఫీల్ తో పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసేలా నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాల విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తల పై ఆ సినిమా యూనిట్ ల నుండి అధికారికంగా ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఇది మంచి పండగ వార్త అనే చెప్పాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news