వైరల్ పిక్; కుర్రాళ్ళకు మతి పోగొట్టేస్తున్న పునర్నవి…!

-

స్క్రీన్ మీద కనపడి, అప్పుడప్పుడు అవకాశాలు వస్తూ హడావుడి చేసే అమ్మాయిలను మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సరే ఏదైనా రియాలిటి షో లో అవకాశం వచ్చినా సరే వాళ్ళు చేసే సందడి అంతా ఇంతా కాదు. యాంకర్లు, అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయినాసరే ఇదే హడావుడి ఎక్కువగా ఉంటుంది. అనసూయ, రేష్మి సహా మరికొందరు ఇదే జాబితాలోకి వస్తూ ఉంటారు.

ఇప్పుడు ఆ జాబితాలోకి పునర్నవి భూపాలం కూడా చేరింది. ఎప్పుడో టాలివుడ్ లో ఉయ్యాల జంపాల సినిమాతో అరంగేట్రం చేసిన ఈ అమ్మాయి అప్పట్లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత శర్వానంద్, నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ కూతురుగా నటించి, రేడియో జాకీగా అప్పట్లో మెప్పించింది.

ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించినా బిగ్ బాస్ లో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ ఇన్నర్ వేర్ తో యోగా చేస్తున్నట్టు ఒక ఫోటోని విడుదల చేసింది. ఈ ఫోటో ఇప్పుడు కుర్రాళ్ళకు హీట్ పెంచుతుంది. కొంత మంది అయితే చలికాలంలో ఇలాంటి బ్రాండ్ లకు యాడ్ లు చేయవద్దని కోరుతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news