ప్రభాస్ కి కృష్ణంరాజు ఇంత అన్యాయం చేశారా..?

-

కృష్ణంరాజు ప్రభాస్ కు అన్యాయం చేయడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అయితే నిజమే అని చెప్పాలి.. అయితే వ్యక్తిగత జీవితంపరంగా కాకుండా సినిమాలపరంగా కృష్ణంరాజు ప్రభాస్ కు అన్యాయం చేశారు. అసలు విషయంలోకి వెళ్తే కృష్ణంరాజు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడం జరిగింది . కృష్ణ , శోభన్ బాబు ఇలా అందరితో కలిసి నటించిన ఈయన మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. అంతే కాదు ఒకప్పుడు కృష్ణంరాజుతో మల్టీస్టారర్ సినిమా అంటే నిర్మాతలకు పంట పండినట్లే కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం కూడా ఉండేది అంతలా కృష్ణంరాజు మల్టీ స్టారర్ మూవీ లకు పెట్టింది పేరుగా మారిపోయారు.

అలా ఒక్క కృష్ణతోనే ఏకంగా 17 సినిమాలలో కలిసి నటించిన కృష్ణంరాజు మంచి విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక శోభన్ బాబుతో కూడా ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. అయితే ప్రభాస్ కి మాత్రం ఒక్క ఫీట్ కూడా ఇవ్వలేకపోయారు. అందుకే ఆయన అభిమాన హీరోకి కృష్ణంరాజు అన్యాయం చేశారు అని రెబెల్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు . నిజానికి ప్రభాస్ , కృష్ణంరాజు కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. మూడు కూడా డిజాస్టర్ కావడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక కృష్ణంరాజు ప్రభాస్ కలసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకుల్లో తెలియని ఉత్సాహం ఉండేది.ఇక అందుకే వారిద్దరి కాంబినేషన్లో సినిమాలు రావాలని కోరుకున్న వారు కూడా ఉన్నారు. కానీ గతంలో కృష్ణంరాజు మల్టీ స్టారర్ మూవీ అంటే హిట్ నమ్మకం ఉన్న నిర్మాతలే ప్రభాస్ కృష్ణంరాజు కాంబినేషన్ అంటే ఫ్లాప్ అవుతుందని భయంతో కూడా ఉన్నారు.

అందుకే వీరిద్దరూ కలిసి నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా విజయం సాధించకపోవడం గమనార్హం. ఇకపోతే ప్రభాస్ – కృష్ణంరాజుల కాంబినేషన్ వర్కౌట్ కాకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది హీరోలకు హిట్ ఇచ్చిన కృష్ణంరాజు కొడుకుకు మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు అంటూ నిరాశ వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news