రవితేజ ని ఆ హీరో భయపెట్టారా

-

రవితేజ సినిమా పేరే క్రాక్‌. టైటిల్‌కు తగ్గట్టు రవితేజాకు కావాల్సినంత క్రాక్ వుంది. దేనికీ భయపడడు.. వెనకాడడు. మూడ్‌ ఎలా వుంటుందో తెలీదు. ఇంత రఫ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వుంచుకున్నమాస్‌రాజా ఒక విషయంలో మాత్రం భయపడిపోయాడు. ఆ హీరోలో తనకంటే ఎక్కువ క్రాక్‌ ని చూసి వెనకడుగు వేశాడు.ఇక హడావిడిగా సినిమా విడుదల చేయబోయి షాక్ తిన్నారు.

సంక్రాంతి బరిలో రామ్‌ రెడ్‌తో.. బెల్లంకొండ శ్రీనివాస్‌ అల్లుడు అదుర్స్‌తో.. విజయ్‌ మాస్టర్‌తో… రవితేజా క్రాక్‌ మూవీతో వస్తున్నాడు. ఈ నాలుగు మూవీస్‌లో రవితేజా క్రాక్‌ 14న రిలీజ్‌ అంటూ.. ముందుగా రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేసుకుంది. అయితే.. అదే రోజు రామ్‌ రెడ్‌తో వస్తున్నాడు. రామ్‌ రెడ్‌ కూడా 14న రావడంతో.. మాస్‌రాజా వెనక్కి తగ్గాడు. 13న మాస్టర్.. 15న అల్లుడు అదుర్స్‌ వుండడంతో… ఈ హెవీ కాంపిటీషన్‌ కంటే సోలోగా వస్తేనే బెటర్‌ అన్న ఫీలింగ్‌లో క్రాక్‌ టీం ఆలోచించి 9నే ప్లాన్ చేశారు.

హెవీ కాంపిటీషన్‌లో థియేటర్ష్‌లోకి వస్తే.. టాక్‌ వచ్చిన సినిమా చూడ్డానికే ఆడియన్స్‌ ప్రిపేర్‌ అవుతారు. అందులోనూ కావాల్సినన్ని థియేటర్ష్ దొరకవు. ఈ గోల అంతా ఎందుకున్న క్రాక్‌.. పండక్కి నాలుగు రోజుల ముందే వచ్చి.. భారీ ఓపెనింగ్స్‌పై కన్నేశాడు. సినిమా రిలీజైన మూడు వారాలకు ఓటీటీలో క్రాక్‌ రిలీజ్ అవతుందంటో వార్తలొస్తున్నాయి. ఏదేమైనా.. రామ్‌ రెడ్‌కు మాస్‌రాజా భయపడ్డాడు.

అయితే ఈ సినిమా నిర్మాత బి.మధుసూధన్‌ రెడ్డి రూ. 10.50 కోట్లు ఫైనాన్షియర్స్‌కు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఈ సొమ్ము వసూలుకు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా ఆరునెలల్లో చెల్లిస్తామని చెప్పిన నిర్మాత ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇపుడు బకాయి వడ్డీతో కలిపి రూ. 11 కోట్లు దాటి ఉంటుందని అంచనా. దీంతో ఈ సినిమా విడుదల కాకుండా మళ్ళీ కోర్టును ఆశ్రయించారు ఫైనాన్షియర్. దీంతో ఉదయం సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన క్రాక్ మూవీ టీం ఎట్టకేలకు సాయంత్రానికి థియోటర్లలో బొమ్మ పడేలా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news