ఈ హీరోయిన్ల వల్లే ఆ ఇద్దరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించి ఎంతో మంది ప్రేక్షకులను బాగా అలరించింది హీరోయిన్ చాందినీ చౌదరి. అయితే ఈమె కొన్ని సందర్భాలలో తనకు వచ్చిన అవకాశాలను వదులుకోవడం తో మంచి సక్సెస్ సినిమాలను మిస్ చేసుకుంది అంతేకాకుండా అలాంటి సినిమాల ద్వారా ఇద్దరు హీరోయిన్లు సైతం ఎంట్రీ ఇవ్వడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం హీరోయిన్ చాందినీ చౌదరి సమ్మతమే అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో హీరోగా కిరణ్ అబ్బవరం నటించారు. ఈమధ్య చాందిని చౌదరి ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది కెరియర్ మొదట్లో ఈమే పలు షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది. దాంతో అక్కడ మంచి సక్సెస్ కావడంతో వెండితెరపైనే అవకాశాలను అందుకుంది. మొదటిసారిగా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, శమంతకమణి వంటి సినిమాలలో నటించింది కానీ అంతగా గుర్తింపు రాలేదు.

 

కానీ 2020 వ సంవత్సరంలో కలర్ ఫోటో చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నది. తాజాగా సమ్మతమే అనే సినిమా ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్నది. ఆలీతో సరదాగా షో లో పాల్గొన్న ఈమె ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపింది. ఈ మీద కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను అంత చిన్న వయసు నుండి నటనపై ఆసక్తి ఉండడంతో షార్ట్ ఫిలిమ్ లో నటించి ఇలా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపింది. ఒక బడా నిర్మాత రెండు సంవత్సరాలకు తనతో ఒక ప్రాజెక్టు సైన్ చేయించుకొని ఒక సన్నివేశం కూడా చేయలేదంట అంతేకాకుండా కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆ సమయంలో తాను మంచి సినిమాలను వదులుకున్న అని తెలిపింది.

అందులో ఒకటి ఊహలు గుసగుసలాడే, మరొకటి కుమారి 21ఎఫ్, పటాస్ వంటి సినిమాలలో అవకాశం వచ్చిన వదులుకోవాల్సి వచ్చింది అని తెలిపింది. ఇందులో రాశీ ఖన్నా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.