అడివి శేష్ అన్నయ్య ఒక స్టార్ డైరెక్టర్ అని తెలుసా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలకి బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే హీరో అడివి శేష్ కి కూడా ఒక బ్రదర్ ఉన్నాడు అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఆయన సాదాసీదా వ్యక్తి కూడా కాదు.. టాలీవుడ్ లోనే మంచి డైరెక్టర్ అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అంతేకాదు అడివి శేష్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ స్థాయిలో గుర్తించడానికి గల కారణం కూడా అడివి శేష్ అన్నయ్య అని తెలుస్తోంది.

What are some must watch films of Adivi Sesh (Telugu actor)? - Quoraమరి అడివి శేష్ అన్నయ్య ఎవరు? ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేశాడు ? అని విషయానికి వస్తే.. అడివి శేష్ కి సొంతంగా అన్నయ్యలు , తమ్ముళ్లు ఎవరూ లేరు. కానీ పెద్దమ్మ కొడుకు అయినటువంటి సాయికిరణ్ అడివి.. మొదటి నుంచి అడివి శేష్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. సాయి కిరణ్ అడివి తెలుగులోనే మంచి దర్శకుడు.. మొదట శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకత్వంలో ఉన్న అన్ని మెలుకులను నేర్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకత్వంలో పట్టు వచ్చిన తర్వాత 2008లో నటుడు కృష్ణుడిని హీరోగా చేస్తూ వినాయకుడు అనే సినిమా తీసి ఘన విజయం సాధించాడు. ఈ సినిమాకు తానే కథను రాసి దర్శకత్వం కూడా వహించడం జరిగింది.

అంతేకాదు ఈ సినిమా కోసం బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. 2009లో వినాయకుడు చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన విలేజ్ లో వినాయకుడు సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సాయికిరణ్ అడవికి ఎంతో క్రేజ్ లభించింది. విలేజ్ లో వినాయకుడు సినిమా ద్వారా నిర్మాతగా కూడా మారారు అడివి శేషు అన్నయ్య. అప్పటినుంచి తన సినిమాలకు తానే కథలు రాస్తూ .. దర్శకత్వం వహిస్తూ.. నిర్మాతగా కూడా చేస్తున్నాడు. కేరింత , కిస్ వంటి చిత్రాలకి కూడా ఈయనే డైరెక్టర్గా వ్యవహరించాడు

Read more RELATED
Recommended to you

Latest news