‘రజనీకాంత్‌ చివరి సినిమా ఇదే’ .. డైరెక్టర్‌ కామెంట్స్‌ వైరల్

-

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీ సినిమా చేస్తున్నట్లు మిస్కిన్‌ వెల్లడించారు. బహుశా ఇదే తలైవా చివరి సినిమా కావొచ్చని అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిస్కిన్.. ‘‘లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించాలని రజనీ ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా గురించి ఆయనే స్వయంగా లోకేశ్‌ను అడిగారు. బహుశా ఇదే రజనీకాంత్‌కు చివరి సినిమా కావచ్చు’’ అని అన్నారు. ప్రస్తుతం మిస్కిన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సినీరంగంలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘తలైవా ఇలాంటి నిర్ణయం తీసుకోరు’ అని ఒకరంటే.. ‘రజనీకాంత్ పై ఇలాంటి ప్రచారాలు ఆపండి’ అని మరో అభిమాని విజ్ఞప్తి చేశారు.

అయితే రజనీ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. ‘బాబా’ సినిమా వచ్చిన సమయంలోనూ ఆయన ఇక తెరపై కనిపించరనే వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి.  తాజాగా మిస్కిన్‌ వ్యాఖ్యలతో మరోసారి రజనీ చివరి సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news