ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా..!

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. సినీ ఇండస్ట్రి మీద కూడా దీని ప్రభావం అధికంగానే ఉంది. కాగా, ఇప్పటికే ఈ మహమ్మారి సోకి అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఈ నెల 9న కరోనా పాజిటివ్ గా డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిపారు. 65 ఏళ్ళ వయస్సు లో కరోనా వచ్చినా నేను బాగానే ఉన్నాను అని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు హోం ఐసొలేష‌న్‌లో ఉన్నాన‌ని పేర్కోన్నాడు. ఈ హోమ్ ఐసోలేషన్ ఈనెల 23 వ‌ర‌కూ ఉండనుందని చెప్పారు.