మ‌ళ్లీ క‌లుస్తున్న ఆర్పీ ప‌ట్నాయ‌క్‌, తేజ‌.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా

డైరెక్ట‌ర్ తేజ ఏ సినిమా తీసినా చాలా కొత్త‌గా అనిపిస్తుంది. ఆయ‌న ఎక్కువ‌గా కొత్త హీరోయ‌న్‌, హీరోల‌ను ప‌రిచ‌యం చేస్తుంటారు. చాలామంది ట్యాలెంటెడ్ హీరో, హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేశారు. ఇక ఆర్పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ ఎంత ఫేమ‌స్సోచెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రూ క‌లిసి చాలా సినిమాలు చేశారు. దాదాపు అవ‌న్నీ మ్యూజిక‌ల్‌గా పెద్ద హిట్ అయ్యాయి.

అప్ప‌ట్లో చిత్రం, జ‌యం, నువ్వునేను, ఔన‌న్నా కాద‌న్నా సినిమాలు పెద్ద హిట్ కొట్టాయి. ఇవ‌న్నీ ఆర్పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ అందించిన‌వే. దీంతో వీరి కాంబోకు మంచిగుర్తింపు ఉంది.

ఇప్పుడు వీరిద్ద‌రూ చాలా రోజుల త‌ర్వాత మ‌ల్లీ క‌లుస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత ఆర్పీ ప‌ట్నాయ‌క్ మ‌ల్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. వీరిద్ద‌రూ క‌లిసి ఇప్పుడు చిత్రం 1.1చేస్తున్నారు. ఈ సినిమాతో ద‌గ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది చిత్రం సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. మ‌రి గ‌తంలో లాగే వీరిద్ద‌రూ క‌లిసి మ్యాజిక్ చేస్తారో లేదో చూడాలి.