నయన తారని వదిలి వెళ్లిన ప్రియుడు..!

-

కోలీవుడ్ ప్రేమ జంట న‌య‌న‌తార‌-విఘ్నేష్ శివ‌న్ ప్ర‌స్తుతం విర‌హ‌వేద‌న‌లో ఉన్నారు. ఇద్ద‌రూ త‌మ త‌మ ప‌నుల్లో బిజీగా వేరే చోట ఉండ‌టంతో విఘ్నేష్‌, ప్రియురాలుగా మిస్ అవుతున్నాడ‌ట‌. వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న విష‌యం తెలిసిన‌దే. అయితే పెళ్లికి ముందే వీరిద్ద‌రూ క‌లిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. రౌడి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ను ప్రారంభించి మంచి సినిమాల‌ను నిర్మిస్తూ ఉన్నారు. ఇక విఘ్నేష్ ఎప్పుడు, ఎక్క‌డికీ వెళ్లినా న‌య‌న్ ప‌క్క‌నే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ప్రియురాలును వెంట తీసుకెళ్ల‌కుండా వెళ్లాడు. ఈ డైరెక్ట‌ర్‌. దీంతో న‌య‌న్ ను మిస్ అవుతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు వెల్ల‌డించాడు.

న‌య‌న్ ఫొటో షేర్ చేస్తూ.. ఈసారి నీతో ట్రావెలింగ్‌ను మిస్ అవుతున్నాను. ఒక ప‌ని పెండింగ్‌లో ఉండ‌టంతో నేను ఒక్క‌డినే రావాల్సి వ‌చ్చింది. త్వ‌ర‌గా ఈ ప‌ని ముగించుకుని వ‌చ్చేస్తాను. లాంగ్ హాలీడే కి వెళ్దాం అంటూ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మార‌న‌ది. అరే ప్రియురాలును ఒక్క క్ష‌ణం కూడా వ‌ద‌ల‌కుండా ఉన్నాడే.. అని నెటిజ‌న్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక‌పోతే విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న్‌, స‌మంత, విజ‌య్ సేతుప‌తి న‌టిస్తోన్న కాతు వాకుల రెండు కాద‌ల్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news