టైం బాగుండి నీ హోదా పెరిగిందని చిరంజీవిని అనే స్థాయి నీకు ఉందా..! మెగా బ్రదర్

-

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యామిలీని ఎవరు ఏమన్నా ముందుగా రియాక్ట్ అయ్యేది మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే పలు విషయాల్లో తన కుటుంబానికి అండగా నిలిచిన నాగబాబు మరోసారి వైరల్ కామెంట్స్ చేశారు..

మెగా బ్రదర్ నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఒకప్పుడు చిరంజీవి వెంట తిరిగి పూలు చల్లి అతన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఈరోజు అతని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు అలాగే ఈ రోజు నీ హోదా పెరిగిందని చిరంజీవిని అవమానించడం సరైన పద్ధతి కాదు ముందు నుంచి చిరంజీవి అదే స్థాయిలో ఉన్నారు అంటూ తనదైన రీతిలో మండిపడ్డారు..

సౌత్ ఇండియాలో అభిమానులను ఎవరి దారిన వారిని వదిలేయకుండా వారితో మమేకమై ముందుకు తీసుకెళ్లిన ఒకే ఒక వ్యక్తి మెగాస్టార్ అన్నారు అలాగే అభిమానులకు అండగా నిలవాలని ఆలోచన చేసిన మొదటి వ్యక్తి కూడా ఆయనే అని చెప్పుకొచ్చారు ఇండియాలోనే అత్యంత శక్తివంతమైన అభిమానుల ఆర్గనైజేషన్ మరి హీరోకి లేదని అలాగే చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ సైతం అభిమానులు ఎంతగానో ఆదరించారని చెప్పుకొచ్చారు.. అలాగే తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలిసే ఉన్నామని అన్నారు చిరంజీవి ముందు నుంచి వినయ్ విధేయతలతో ఉన్నారని అతని ఎవరైనా ఏమైనా అంటే అభిమానులే ముందుగా రియాక్ట్ అవుతారని చెప్పకు వచ్చారు.. అలాగే చిరంజీవి లాంటి సున్నిత మనస్కుడు రాజకీయాల్లోకి పనికిరాడని అందుకే మనస్ఫూర్తిగా నచ్చకే వెనక్కి వచ్చారని చెప్పుకొచ్చిన నాగబాబు పదేళ్ల తర్వాత కూడా చిరంజీవి సినిమాలు తీస్తే అదే స్థాయిలో అభిమానించే అంత అభిమానం ఆయన సంపాదించుకున్నారని అన్నారు..

ఇటీవల ఒక వ్యక్తి చిరంజీవిని తనకు నచ్చినట్టు మాట్లాడారని చెప్పకు వచ్చిన నాగబాబు.. ‘‘సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి వెళ్లినప్పుడు.. ఆయనవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులను చూశాం. నువ్వు ఎంతపెద్ద నాయకుడివి అయితే మాకేంటి.. మేము ఏమైనా అన్నామా?. రెస్పెక్ట్ అనేది ముఖ్యం. చిన్నైనా, పెద్దైనా గౌరవించాలి. ఒకప్పుడు అదే వ్యక్తిని నువ్వు సాదారంగా ఆహ్వానించి పూలు చల్లి తీసుకెళ్లావు. నీ టైమ్ మారింది. నువ్వు పెద్దోడివి అయి ఉండోచ్చు. చిరంజీవి అల్రెడీ పెద్ద వ్యక్తి.. ఎప్పటికీ అక్కడే ఉంటాడు. నువ్వు రేపు పొద్దున దిగొచ్చు.. కానీ చిరంజీవి అక్కడే ఉంటాడు’’ అన్నారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ వ్యక్తి ఎవరో అంటూ చర్చ జరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news