యాదాద్రి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. యాదాద్రిలో ఈ నెల 30న స్వామి వారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక ధర్మదర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్ దర్శనాలను కూడా క్యాన్సల్ చేస్తున్నామని వెల్లడించారు. నిత్యకైంకర్యాలను అంతరంగీకంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు యాదాద్రిశ్వరుడిని నలుగురు రాష్ట్ర ప్రతులు మాత్రమే దర్శించుకోవడం విశేషం.